Others
తుమ్మ ముల్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అదే సూర్యుడు అదే చంద్రుడు
అదే కాంతి అదే చీకటి
రోజులు ఖుషిగా కాలర్ ఎత్తుకు నడిచిపోతూ ఉండేవి
* * *
చిన్నప్పుడు
బడికి గుడికి పోదాం అనుకున్నప్పుడు
అరికాళ్ళలో ముల్లు విరిగి
విలవిలలాడి పోయాను
కాళ్లకు చెప్పుల రక్షణ లేవు
తరగతిలో చేతులకు
ఎప్పుడూ మైదాకుతో మెహర్నిసాబేగం
మసీదులో రోజూ మబ్బుల
నమాజ్ చేసే యాకూబ్
గమగమ జవ్వాజి పొడి
సువాసనతో స్వరాజ్యలక్ష్మి
దేవుని స్తోత్రం లాటి జ్ఞానానందరావు
అందరం చీకటి బావిలోని
విజ్ఞానాన్ని తోడే చేంతాడు
పురిలా కరితో కలిసిమెలసి ఉండేవాళ్ళం
నల్లబల్లపై తెల్లని గీతలా సహాధ్యాయులతో
ఇప్పుడు నా ఈడు 64
సూర్యుడు చంద్రుడు ఎప్పటిలాగే
కానీ, వెలుగు కంటిలో తమస్సు
నలక పడింది మిత్రులంతా
ఎటుపోయేవాళ్ళు అటుపోతున్నారు
శత్రువుల చేయి కలుపుతున్నారో
చెయ్యి ఇస్తున్నారో
తెలువదిగాక తెలువది
ఏమైందో ఏమో ఎట్లా చేరిందో
అందరిలో లోనా అగ్గి పగ రాజుకుంది
కాళ్లకు కళ్ళు చెవులు ఉన్నాయి
సర్కారు ముళ్ళు గురిచూసి
ఇప్పుడు గుండెల్లో దిగింది
చెప్పుకోలేని రాని నొప్పి తడ తడ పెడుతుంది