Others

తీర్థయాత్రా స్పృహ... ఆత్మమార్గానే్వషణ స్థాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవర నిర్వేదము (కావ్యం)
-ఆచార్య అనుమాండ్ల భూమయ్య
మనస్వినీదేవి ప్రచురణ
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్
ఆర్యసమాజ్ రోడ్
కాచిగూడ,
హైదరాబాద్-27.
వెల: రూ.100
*
పెద్దన ‘మనుచరిత్ర’ ఆధారంగా అనుమాండ్ల భూమయ్యగారు గేయాత్మకంగా సంతరించిన కావ్యం ‘ప్రవర నిర్వేదము’ ముండకోపనిషత్తు, కఠోపనిషత్తులలోని అంశాలు మూలాధార నాడిగా నిల్పి కర్మకాండ, జ్ఞానకాండల అనుసంధానం ప్రవర పాత్రకు చేయాలనిపించి, వేదం చెప్పిన కర్మకాండ - అగ్ని కార్య నిర్వహణలో అత్యున్నత స్థాయి నందుకున్న ప్రవరుడు, వేదం చెప్పిన జ్ఞానం కూడా పొందినట్లయితే మూర్త్భీవించిన వేదమవుతాడు కదా అనే భావనంతో ఈ కావ్య రచనకు సమకట్టారు. అల్లసాని పెద్దన - దారి తెలియక బాధపడిన ప్రవరుడు చివరకు ఇల్లు చేరడంతో ఇంక అతని విషయం వదిలేశాడు. పెద్దన వదలిన ప్రవరుని మీద అనుమాండ్ల భూమయ్య పెట్టిన దృష్టి ఇలా కావ్యరూపం దాల్చింది. నిత్యాగ్నిహోత్రుడైన ప్రవరునికి బ్రహ్మనిష్ఠుడైన గురువు బోధిస్తే జ్ఞానసిద్ధి సమకూడడం కష్టం కాదు. ప్రవరుడు శిష్యుడుగా, అగ్నిదేవుడు బోధకుడుగా నిలిపారు కవి.
‘ఆత్మను పొందటానికి ఎక్కువ తపన పడిన వానికి మనోవ్యాకులత పొందిన వానికి ఆత్మ తనను వెల్లడి చేసుకుంటుంది. ప్రవరుడు నిర్వేదం పొందినాడు. గురువు అందివచ్చినాడు.’
ప్రవరునికి జ్ఞానోదయం కలగడంతో ఈ కావ్య రససిద్ధిని చూపారు కవి. మనుచరిత్ర అభిమానులూ, రసజ్ఞులూ అల్లసాని పెద్దన కావ్యం లాగానే అనుమాండ్ల భూమన్న గారి ఈ కావ్యాన్నీ హర్షించగలుగుతారు. గొప్ప సాంప్రదాయాభిజ్ఞత కలిగిన భూమనగారు పునరాగమనము, నిర్వేదము, జ్ఞానామృతము అనే మూడు ముచ్చటైన అధ్యాయాలుగా లిఖించిన ఈ కావ్యం గేయపు నడకలతో పాఠక హృదయాహ్లాద శ్రేయోదాయకంగా రూపొందింది.
కోవెల సుప్రసన్నాచార్యులు గారు తమ మున్నడిలో అన్నట్లు-
‘ప్రవర నిర్వేదంలో హంస రూపమైన అగ్ని అనాహతంలో నుండి బయటకు వచ్చింది. ఋగ్వేదం లోని అగ్ని సూక్తాలలోని దివ్య చైతన్యాన్ని అతనికి సాక్షాత్కరించింది. ఆత్మసాధన విషయం చెప్పేటప్పుడు భూమయ్య కవిలో శ్రీ శంకరులు, శ్రీ అరవిందుల వేద వ్యాఖ్యానాలు స్ఫుటంగా వెలికి వచ్చినాయి.’
ప్రవరునిలోని తీర్థయాత్రా స్పృహను ఆత్మమార్గానే్వషణ స్థాయికి భూమయ్యగారు పెంచారు. ఇది మనోజ్ఞ కల్పనం మాత్రమే కాదు నిగూఢ ఆత్మతత్త్వ నిరూపకాంశాలు సులభసుందరంగా కరతలామలకం చేయడం.
యాత్ర చేసిన అది ఆత్మయాత్ర చేసి
నట్లె అన్పించవలె, హృదయాంతరాళ
మందె అజ్ఞాతమై యున్న అమరకాంతి
పెరిగి చంద్రుడైనట్లె అన్పించవలె
అని తీర్థయాత్రా లక్ష్యాన్ని కూడా ప్రబోధిస్తారు కవి. గృహస్థ ధర్మ ప్రాధాన్యాన్ని సోమిదేవమ్మ పాత్ర ద్వారా కావ్యంలో అభివ్యక్తీకరించారు. సహృదయులు, కవితా రసజ్ఞులు సహస్ర చంద్ర దర్శనజీవి శ్రీ గజానన్ తామన్‌గారికి ఈ కృతిని అంకితం చేయడం బాగుంది. ఈ కావ్య పఠనంతో పఠితలోక అంతరంగాలలో రసదీప్తులవతరిస్తాయని ఆకాంక్షిద్దాం.

- సుధామ