Others

చిత్రవర్ణ పట్టకం ‘సూర్య స్పందన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యస్పందన
(రచనా సంకలనం)
-వేదం సూర్యప్రకాశం
వెల: రూ.30
ప్రతులకు: రచయిత
ఎ-జి-3, పావని ప్రిస్టేజ్
అపార్ట్‌మెంట్
అపోజిట్ మోర్ సూపర్ మార్కెట్
మాగుంట లేఅవుట్
నెల్లూరు - 524 003.
*
వేదం సూర్యప్రకాశం - ఇంటి పేరులోనూ, పేరులోనూ - సాహిత్య సంప్రదాయాలు విజ్ఞత, తరతరాల ఉన్నత వారసత్వ విశేషాలు ఉట్టిపడుతున్నై! మనిషిని చూస్తే దగ్గరితనం స్వాగతిస్తుంది. వెరసి ఆయన కదలికల్లో ఎక్కడా ఏ వ్యూహమూ లేని, హృదయంలో ఏ ‘అర’మరికలూ లేని స్నేహం కరచాలనం చేస్తుంది. ఈ పుస్తకం ‘సూర్య స్పందన’ రచనా సంపుటి. నిజానికి ఇదొక రచనా కదంబం. ఆ కాలంలో ‘్భరతి’ మాసపత్రికలో ‘కలగూరగంప’ అని వేసేవారు. అలాంటిదీ ఇది! సూర్యప్రకాశం గారి ప్రతిభా, వ్యుత్పత్తీ - కొండ అద్దమై- కనిపింపజేస్తున్న చిత్రవర్ణ పట్టకం! చిన్న స్కెచ్; కొన్ని కవితలు తెలుగులో, మరికొన్ని ఆంగ్లంలో! ఇంతింతలో అంతంత బహుముఖీనత్వం!
సూర్యప్రకాశం గారి కవితలు కొన్ని గేయాత్మకం. ఒక కొంత మాత్రాఛందస్సు, లయ, తూగు తెప్పించే గీత ఫణితిని సాగాయి. ఆ తర్వాత ఎక్కువ కవితలు వచన కవితా రూపంలోనే వెలువడినై. కవితల్లో సమకాలీన సమాజం పోకడ, మనుషుల మనస్తత్వాల్లోనూ, ప్రవర్తనలోనూ కొట్టవచ్చినట్టున్న వైరుధ్యాలూ చోటు చేసుకున్నాయి. ‘అది గతం.. ఇది ఇహం’లో ‘ద్వే సంతతం ఆనందం ఆస్తి’ అది పోరుకారమని ఆచరణాత్మకతని సందేశిస్తారు కవి. ఇది మానవతలో ఈనాటి లోపం. సూర్య ప్రకాశం గారికి స్వచ్ఛమైన మనసూ, ఆలోచనలూ ఉన్నాయి. వర్తమాన సమాజ కల్మశాన్ని చూసి బాధపడే బాధ్యత ఉన్నది. కవిగా ఆర్తుల పట్ల బాధపడే బాధ్యత ఉన్నది. తన స్పందనని పాఠక లోకానికి కవితాత్మకంగా వెల్లడి చేయగల అభివ్యక్తి శక్తి ఉన్నది. దానిలో వ్యంగ్యం చాలా పదునుగా ఉన్నది. ప్రతి వస్తువునూ ఒక తాత్త్విక - ధోరణితో చూసే ధోరణి ప్రద్యోతకమవుతూంది. కవి దృష్టిలో బ్రతుకు బాధ్యతను గురించిన విచారణ, కవి మనస్సు ఎప్పుడు మూగపోతుందో, తరాల అంతరాన్ని చూపే విలువల మార్పులేవో, ఈ కవితల్లో కన్పిస్తుంది. మనిషి మహదాశయాలకై జీవించిన మహనీయుల విగ్రహాల్ని ప్రతిష్టించి వారు బోధించిన విలువలనెలా మరిచిపోయాడో అవగతమవుతోంది. భిన్నభిన్న అంశాలను, పరిణామాలను వివిధ ప్రతీకల ద్వారా ప్రతిభా సమన్వితంగా ప్రభావవంతంగా ప్రదర్శించారు సూర్యప్రకాశం. ఈ రచనా సంకలనంలో 21 తెలుగు కవితా ఖండికలున్నాయి. వీటిలో కన్పించే కవితాధారలో ఆంగ్ల కవుల కవితా గీతాల ధోరణి కన్పిస్తూంది. ఆంగ్ల భాషోపన్యాసకులూ - ఆంగ్ల సాహిత్య విద్యార్థీ అయిన సూర్యప్రకాశం గారు ఎంతగా ఆంగ్ల కవితా ధోరణులతో ప్రభావితులైనారో ఈ కవితలలో సుస్పష్టంగా తెలియవస్తూంది.

- నిరీక్షణ్