Others

బీసీ కవిత్వ సంకలనానికి కవితలు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాత్మా జ్యోతిభా పూలే ఆలోచనలు విస్తరించుకుంటూ దేశవ్యాపితంగా బీసీ చైతన్యం పదునెక్కుతోంది. ఈ నేపథ్యంలో గతం నుంచి భవిష్యత్తుకు తెలుగు సమాజంలోని బీసీలు ఐక్యతతో అడుగులు వేయవలసి ఉంది. బీసీ తాత్త్విక చింతనతో ఎవరి కుల మూలాలనుంచి వారు రాసుకోవాల్సి ఉంది. తమ కులవృత్తుల, సంస్కృతుల, చరిత్ర, సామాజిక అంశాల నేపథ్యంతో బీసీ కవులు తమ కవిత్వాన్ని పంపించాలని బీసీ కమిషన్ సభ్యుడు, ప్రముఖ కవి జూలూరు గౌరీశంకర్ ఒక ప్రకటనలో కోరారు. బీసీ సంకలనం తీసుకురావాలన్న తలంపుతో చేపట్టిన ఈ బృహత్కార్యంలో బీసీ కవులందరూ పాలుపంచుకోవాలని, మార్చి 25వ తేదీలోగా తమ కవితలను జూలూరు గౌరీశంకర్, ఎం.ఎస్.కె.టవర్స్, ఫ్లాట్ నెం.410, స్ట్రీట్ నెం.11, హిమాయత్‌నగర్ - 500 026 చిరునామాకు పంపించాలని ఆయన కోరారు.