Others
హిమ ధూమం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 5 March 2018
- వేదం సూర్యప్రకాశం, 9866142006

అరుణ కిరణాల గిలిగింతలకు
కితకితలకు
కించిత్తు బద్ధకంగా ఒళ్లు విరుచుకొనే
నిర్లిప్తతకు నిలువుటద్దం,
ఆనందానికి అవరోధం
పొంగివచ్చే దుఃఖం పేరుకుపోయనట్లు
ప్రయాణ పురోగమనానికి ప్రమాదహేతువు
శతృశిబిర నిఘా నేత్రానికి అడ్డుతెరలా
సువిశాల శే్వత కుడ్యం
సుదూర శే్వతనగం
ప్రేమికుల పెన్నిధి
వృద్ధ, వ్యాధిగ్రస్తుల నిషేధం
పరిమితి లేని పారిశ్రామికీకరణ ప్రభావం
కురిసిందంటే కొందరికి మోదం
మరికొందరికి ఖేదం
ఈ మాసపు హిమధూమం