Others
ప్రకృతి - మానవుడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయాస్తమయాల రంగులు కలసిన
పొలిమేర మీద
పరిమళ నిశ్వాసాల్లో పరవశిస్తున్న నిశ్శబ్దాన్ని
సుమగాత్రి ఎవరో రాత్రిగా మార్చింది
పగటి బాధను దిగమ్రింగి
చెరువులోని చెంగల్వ
వెనె్నల వేణువు నూదుతోంది
శీతల కిరణ సంస్పర్శకు
చేరువైన కాలదూరం
తళుకు నీలి తారళ్యంగా
మధ్యమావతిని మలపించింది...
ఊహకు రెక్కలొచ్చి ఉదధులీదేవాడు
ఉనికి పరమార్థాన్ని ఉత్ప్రేక్షగా మార్చేవాడు
స్వప్నాన్ని కనడానికి స్వర్గాన్ని
కనుఱెప్పల్లో బంధించేవాడు
విడిచి వెళ్లిన స్పృహాభిరామాన్ని
చెట్ల చిగురుల్లో దర్శించగలవాడు
జీవన తృష్ణని
ప్రేమ ధారల్లో ముంచెత్తేవాడు
ఒలికిపోయన కథలాంటి శూన్య పాత్రను
అనురాగపు అర్థాల ఆసవంతో నింపేవాడు
సుఖాన్ని దుఃఖాన్ని కలిపి జీవరక్తం తయారుచేశాడు...
రేచాయ మిసిమి తేలేటట్లు
పూత వెనె్నల మీద సానదీసింది
కఱకు టెండలకు కంది గాజువారిన కల్వజవరాలికి
చల్లని చంద్రికావసనాన్ని నేసిపెట్టింది
తేటతేరిన మంచు క్రొమ్మించుదనాన్ని
గరిక పచ్చని కొసమీద గగురుపొడిచింది
వడగట్టినట్లున్న సన్నవెనె్నల తరగలో
నెలఱాలు కరగబోసి నెరులు తీర్చింది
ఒక సాయంత్రాన్ని గంధపుకొండ
చల్ల లేగాడ్పులో ఊగిస్తూ
చందమామని చుక్కల తెరువులో చౌకళించింది...
కళ్లలో కదిలే కలల గుర్తులు గుత్తులు కట్టినప్పుడు
సందర్భ సహిత వ్యాఖ్యగా వ్యవహరిస్తూనే వున్నాడు
సూర్యగోళాన్ని ముందుకు తోసే వాడికోసం
చిరంతనంగా ఎదురుచూస్తూనే వున్నాడు
పంచభూతాల్ని రెచ్చగొట్టే పంచలో
పారిజాతాన్ని పెంచుకుంటూనే వున్నాడు
ఆకలేస్తే అరుస్తున్నాడు - అంతలోనే
కడుపు నిండి కళ్ళు మూతలు వేస్తున్నాడు
ఊపిరి కంటె అస్పష్టమైన ఆత్మను అదిమిపెట్టి
చేసే అనంత యాత్రలో చెయదాన్ని మరిచిపోతున్నాడు..