Others

పురావశేషాల గదిలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ వాక్యాల కౌగిలిలో
నన్ను ప్రేమారా పొదుపుకుని
మైమరచిపోయేలా చేస్తావు
నీ పదాల పాద ధ్వనుల్లో
నా జీవన నాట్యాన్ని
నెమరేసుకునేలా చేస్తావు

నా తడిని నీకంటిస్తూ
నిన్ను తిరగేసిన ప్రతిసారీ
నాకెన్నో కొత్త బంగారు లోకాలు
పరిచయం చేస్తావు
నా కంటి తడిని నీకంటిస్తూ
నీలోకి నేను తీక్షణంగా చూసిన ప్రతి క్షణం
ననె్నన్నో పన్నీటి ముత్యాలతో
పలకరిస్తావు

నా కంటి చినుకుకు చూపుడు వేలువు
నా చేదు జ్ఞాపకాల చక్కెర పూతవు
నా గాయాలకు గేయాల గొంతువు
నా ఒంటరి తనాల ఆత్మీయ క్రతువు
నా దుఃఖ సమయాల మరుపు మలుపు

నీవెన్నిసార్లు పడిపోతున్నా నాకు
పందిరి గుంజవయ్యావు
నా సుడిగుండాల బతుకు సముద్రం మీద
నన్ను తీరం చేర్చే తెలతెల్లని చెక్క పడవల్లా
నీవెన్నిసార్లు మారిపోయావు

నీ ఒడిలో ప్రేమగా పరుచుకుని
నిజానికి నన్ను అటూ ఇటూ తిరగేసి
జీవిత పాఠాలు బోధించేది నువ్వే
నీ భావాల దండ గుచ్చి
నన్ను ప్రపంచ పరిచయ వేదికల మీద
గుబాళింప చేసేది నువ్వే
నీ అక్షరాల కలువల కోనేటిలో
నన్ను మనసారా స్నానం చేయంచి
నీ వేనవేల దొంతర్ల పొత్తిళ్లలో
నన్నో నెమలీకలా దాచుకుని
జోకొట్టేది నువ్వే

నా దగాపడిన సమయాలను
తలపోటు సందర్భాలను
నీ కాగితపు మత్తు పూసి
నిద్ర పుచ్చుతావు
నా ఒంటరి కన్నీళ్లకు పగిలిపోయ
నీ స్వప్నలోకాల
పూల వంతెనలపై నడిపిస్తావు
నేనెప్పుడెరగని నవ్వుల పూలతో
ముడి వేస్తావు

నా హస్త్భూషణమై
నా గుండె భాషణమై
నీ బొమ్మల్లో నన్ను బొమ్మ కట్టి
నీ ముఖ చిత్రాల్లో
నా ముఖ బింబాన్ని ప్రతిబింబించి
నిత్యం నా చీకటి చింతలో
వెలుగు కలువలా రేకలు విచ్చి
నాతో సంభాషిస్తూ నా వెంట తిరిగే
ఒకే ఒక సహచరివి కదా నువ్వు
నా పురావశేషాల ఒంటరి గదిలో
నువ్వు పక్కన లేకపోతే
నాకు తలగడే కాదు
జీవన మనుగడే లేదు

- చిత్తలూరి సత్యనారాయణ, 8257432521