Others

మొన్న..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. మొన్న...
మబ్బుల ఊరి చివర చెరువులో కొమ్మల నీడలు
ఈతకొడుతుండేవి
వాములోంచి ఎగిరిన గడ్డిపోసలు
ఎద్దుకొమ్ముల్ని ముద్దాడేవి
పసుపురంగు పూసుకుని పడమర మెరిసిపోతుండేది
మిరప చేనును సీతాకోక
కంటి రెప్పలతో
కాపుకాస్తుండే
పందిరి మీద బీరతీగలు,
మల్లెమొగ్గల్ని ముద్దాడినట్టు
మనుషుల మధ్య ప్రేమలు పెనవేసుకునేవి
మట్టిమీద పడ్డ నాగలి గీతలు
బతుకు రూపం చిత్రించేవి

2. నిన్న...
ఇసుక తోడేసుకున్న
వాగులా ఊరు, అక్కడి ఊహలు
పిట్టలు విడిచిన చెట్లు,
కూలిన ఇంట్లో తేలిన సెల్ టవర్, చిగురుకు పట్టిన చీడ, చింతలకు వేలాడుతున్న ఉరితాడు నీడ,
చెల్లాచెదురుగా పశువులు,
కొన్ని కలలు,
దిబ్బల్లో రేకులు రాలిన పూలు, మరికొన్ని
పిరికి చూపులు, చీకటిని వడికి మూట కట్టుకున్న రాత్రుళళు, కరుగుతున్న
క్యాడ్ బరీ చాకలెట్లా గుట్టలు,
కంకర దుమ్ము నింపుకున్న కండ్లు, మిట్టమధ్యాహ్నం
నీరెండలో వలసబాట పట్టిన బండ్లు

3. నేడు...
మడి మైదానంలో మొలుస్తున్న
మొగులెత్తు భవంతులు, మొండి రాళ్ళ మీద విల్లాలు, పరిమితుల విలాసాలు,
గేటెడ్ కమ్యూనిటీలో
పచ్చదనమై
మెరుస్తున్న పార్క్,
పక్షులు లేని పల్లె లాంటి పట్నంలో
పిల్లల ఆట,
ఫౌంటెన్ తుంపరల్లో తనయుల ఈతలు,
తండ్రుల ఈయంఐ వెతలు,

వెరసి
సూర్యుడు మొన్నను
ఎర్రగా పూసుకుని నిష్క్రమణ

- వేముగంటి మురళి ఫోన్: 8309178109