Others
భవతీ బిక్షాందేహి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నువ్వు...
అధికారాన్నిచ్చే అద్భుతానివి
ప్రజాస్వామ్యానికే
తొలి ఆరాధ్య దైవానివి
వాగ్దాన మ్యానిఫెస్టో
మరుగు మందు పూయబడ్డ
పార్టీ కల్పవృక్షానివి
అయదేళ్ళు
నిన్ను పాతాళానికి తొక్కేసినా
మళ్లీ ఎన్నికల్లో
కేవలం నాయక స్పర్శ తగిలితేనే
త్రివిక్రముడవై ఉబ్బితబ్బిబ్బైపోతావు
ధృతరాష్ట్ర కౌగిలిచ్చి
నుల్కమంచంలో కూర్చుంటేనే
సహపంక్తి భోజనంలో షడ్రుచులుగా
నీ స్వప్రయోజనాల్ని వడ్డించి
వామనుడిలా చిన్నవాడివైపోతావు
ఏడాదికో ‘దినం’ కేటాయస్తూ
అనుదినం వృద్ధికి కర్మకాండలు చేస్తూ
నిన్ను నిరీక్షకున్ని చేసి
ప్రజాస్వామ్యానికే పరీక్షలు పెడతారు
హక్కుల్ని కర్కశంగా కాలరాయడం
విలువల్ని నిప్పుల్లో తగలెయ్యడం
సహజాతి సహజం
ఇక్కడ అడుక్కోవడం
మాటజారి
నోర్లు కడుక్కోవడం మామూలే.
రాజ్యాంగం కల్పవృక్షమే
పాలకుడు పారిజాతమే
పాపం ఓటరే భవతీ బిక్షాందేహి!