Others

వికృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసిపాప నవ్వింది
పుప్పొడి రాలింది

లేత పెదవి విచ్చింది
పాలోసుకుని వరికంకి పొంగింది

చిట్టిచిట్టి చేతులతో మబ్బుల్ని నిమిరింది
నీటి తడి నేలను తడిమింది

నింగి ఇంద్రధనస్సునెక్కుపెట్టింది
బోసి నోరు తొలి శబ్దం విడిచింది

నెలబాలుడికి అరికాలు తాటించింది
వెనె్నలసోన సొగలిడిచి సోలిపోయంది

కిలకిలమని కనురెప్పలు అల్లార్చించింది
రేయపగళ్లకు కొత్త సమయాలు నిర్ణయంచింది

పాపాయని పెనవేసుకుంది ప్రకృతి
ప్రకృతికి ప్రాణవాయువులూదింది పాపాయ

- అవును, పిల్లలే ప్రకృతి
ప్రకృతే పిల్లలు
మనమే...
చేజేతులా వారిని మనుషుల్ని చేస్తాం
అచ్చం ప్రకృతిని ధ్వంసం చేస్తున్నట్టే!

- దేశరాజు