Others

పంచుకో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుఃఖపు చెట్టు కింద
ఒక్కడివే అలా కుమిలిపోతావేం?
శోకపు నుడిగాలికి
ఒంటరి ఈతచెట్టులా అల్లాడిపోతావేం?
నిరాశాలోయల్లో
ఒంటరి గబ్బిలమై అలా సంచరిస్తావేం?
తలా యంత వడపప్పు పంచినట్టు
బాధనో గాథనో పంచుకో
మనిషితోనో.. మానుతోనో!

చీకటి గుట్ట మీద కొడిగట్టిన దీపంలా
అలా కొట్లాడిపోతావేం?
నాలుగ్గోడల మధ్య నీడవై పోతావేం?
నక్కలా బొరియలో నక్కిపోతావేం?
కోవెల్లో తీర్థం పంచినట్టు
కష్టాన్నో - సుఖాన్నో - పంచుకో...
కొండతోనో - చాకిరేవు బండతోనో!

పుట్టెడు సంబరాన్ని గుండె గాదిలో కుక్కి
అలా ఉక్కిరిబిక్కిరైపోతావేం?
దిక్కులు పిక్కటిల్లేలా...
గతులు దద్దరిల్లేలా పెనుకేక పెట్టవేం?
గుల్లలో నత్తలా
కలుగులో ఎలుకలా అలా మగ్గిపోతావేం?
తలా యన్ని తలంబ్రాలు పంచినట్టు
దుఃఖాన్నో సంతోషాన్నో పంచుకో
పుట్టతోనో చెట్టుతోనో వాలే చీకటిపిట్టతోనో!

పెదవి గట్టు దాటి చీకటి ప్రవహించనీ
గుండెగట్టు దాటి వెనె్నల ఉప్పొంగనీ
ఎదలో పొడగట్టిన వేకువ వెల్లువెత్తనీ
పంచుకుంటే
ఆనందం పదింతలవుతుంది
పంచుకుంటే
దుఃఖం దూదిపిందై తేలిపోతుంది

- సిరికి స్వామినాయుడు,
9494010330
*
బంధాలు, అనుబంధాలు
కాస్త
‘మనీ’తో పెనవేసుకుని
మనసులను
మనుష్యులనూ దూరం చేస్తుంటే...
క్రమంగా...
ఆప్యాయతలు, అనురాగాలు
స్వరం మార్చుకుంటున్నాయ!
ఒకరికి మరొకరికి మధ్య
సంబంధ బాంధవ్యాలు
మసకబారుతున్నాయ!
విరామం ఎరుగని కాలం
ఎంచక్కా...
తన పని తాను చేసుకుంటూ
ముందుకు సాగుతుంటే
ఎనలేని ప్రేమను ప్రదర్శిస్తూ
వృద్ధాప్యం నాతో...
జతకడుతోంది!
నా అనుకున్నవారు
స్వార్థం గొడుగు నీడలో
సేద తీరుతూ
నిశ్శబ్దాన్ని నాకు బహూకరిస్తుంటే...
ఒంటరితనంతో
దోస్తీ చేస్తున్నా!
నా అంతరంగంలో ఏర్పడ్డ అగాథాన్ని
అక్షరంతో భర్తీ చేసుకుంటున్నా!
- దాస్యం సేనాధిపతి, 9440525544
*
నవల
నునుసిగ్గు
కాస్తంత ఒదిగినందుకే
చూపు నేలకతుక్కుపోయంది కదా?
దొంగ నవ్వొకటి చెక్కిలి గిల్లిపోతే
చుక్కల తీరం నుంచి చమక్కులు కళ్ళల్లో.
సన్నాయ సుప్రభాతవేళ నుంచి
కంటి కొనల్లో బాసలు
సన్న దీపం గుసగుసలాడే దోసిలి నిండా
జాజిపూల నయగారం
కనుదోయ నిండా
నల్ల కలువల నాజూకు
మది నిండుగా మల్లెపూల గుబాళింపు
చిరునవ్వు సాగి నాట్యం చేసినట్టు
ఎద మీటిపోతే చాలా?
మనోజ్ఞమయన నవమి నవ్వు
నిఖలము... నిగూఢము
నిఘంటువు
ఎంతైనా చదువు
ఇంకా మిగిలి ఉంటుంది
చందమామ పరుగులా అందాక... అందాక..
నింగి నుండి నేల దాకా...

- బులుసు సరోజినీదేవి, 9866190548