Others
ఊరట
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 8 July 2018
- గొల్లపెల్లి రాంకిషన్

చెరగనీకు పెదవులపై
చంద్రవంక చిరునగవు
చేయబోకు ఎడదనెపుడు
వెతలకింక తావు
ఆటుపోట్ల తాకిడికి
వెరవబోదు రేపు
కలతలు కన్నీళ్ళు
కలకాలం మనలేవు
ఎండకైన వానకైన
కొండ చెక్కుచెదరదు
తన గొంతు ఎండినా
ఎడారింక బెదరదు
రేయైనా పగలైనా
నది నడకనాపదు
ఋతువులెన్ని మారినా
చెట్టు ఎపుడు జడవదు
బతుకు చిటికెడైనగాని
బుడగకింక పంచదా
తలకుమించి బరువైనా
చీమకు తలవంచదా
గెలుపు ఎంత గొప్పదైన
పట్టుదల ముందు ఓడదా
ప్రేమతో జతకడితే
హాయ వంతపాడదా