Others

ఇగిరిపోవే కన్నీటిచుక్కా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విత్తిన విత్తు మొలకెత్తనపుడు
మొలక పంటనివ్వనపుడు
రైతు కంట కనబడక
ఇగిరిపోవే కన్నీటిచుక్కా వేధించక!

మీరిన వయసు రాని ఉద్యోగం
పనికి రాని పట్టాను చూసినపుడు
నిరుద్యోగి కంట కనబడక
ఇగిరిపోవే కన్నీటి చుక్కా వేధించక!

కూటి కోసం కూలికెళితే
కొండంత రెడ్డి కొంగుపడితే
పసికూన కంట కనబడక
ఇగిరిపోవే కన్నీటిచుక్కా వేధించక!

పండిన పంట దళారిపాలైతే
ఆశలు ఆవిరైన వేళ
కడుపు కాలిన కౌలుగాని కంట కనబడక
ఇగిరిపోవే కన్నీటిచుక్కా వేధించక!
మత్తుకు బానిసై
కాని పనులు చేసి
కుమిలిపోయే కుర్రాడి కంట కనబడక
ఇగిరిపోవే కన్నీటిచుక్కా వేధించక!

కొంటె చూపులను విసిరి
వెగటు వాసనలను రుద్దుకొని
మనసు చంపుకొని కొంగు పరచునపుడు
కోమలాంగి కంట కనబడక
ఇగిరిపోవే కన్నీటిచుక్కా వేధించక!

మూనె్నళ్ళకే కడుపులోన
పిండం ఆడపిల్లని తెలిసి
గర్భస్రావం చేస్తున్న సమయాన
మనసు బాధను మునిపంటిన భరిస్తున్నపుడు
తల్లి కంట కనబడక
ఇగిరిపోవే కన్నీటిచుక్కా వేధించక!

- సురేంద్ర రొడ్డ, 9491523570