Others

మాటా వౌనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌనం మంచిదే గాని
మాటలు లేకుంటే
దానికి విలువ లేదు.

గాలి మాట్లాడుతుంది
పువ్వు పరిమళమే భాష
పరిమళాన్ని మోసుకెళ్లేది పవనమే

అతడు కవి
వౌనంగా వున్నప్పుడు
చిరునవ్వే అతని భాష
ఇప్పుడు డొల్లగా కనిపిస్తున్నాడు
అప్పుడప్పుడు
వౌనం ముందు మాటలు సిగ్గుపడతాయ.

వర్షం జోరుగా మాట్లాడుతుంది
కాని గూటిలో
పక్షి ధ్యానం ముందు
అది తేలిపోతుంది.
స్వతహాగా వానకు భాష లేదు
వస్తువుల పైనే ఆధారపడుతుంది.

అమ్మను
సమీకరణాల్తో చూసినప్పుడు
మాటలు మలినవౌతాయ

మాటలు పక్వానికి రావాలంటే
వౌనంలో మాగాలి.
వౌనం సుదీర్ఘమైతే
మాటలు అపరిచితవౌతాయ.
మాటా వౌనం
పక్కపక్కనే ఉంటాయ గాని
రెండింటి కౌగిలి ఫలిస్తేనే
అది సాఫల్య జాబిలి.

- డా. ఎన్.గోపి