Others

కథల పోటీకి ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీని నిర్వహిస్తున్నట్లు జాగృతి వారపత్రిక ఒక ప్రకటనలో తెలిపింది. సమకాలీన, చారిత్రక, సైన్స్ ఫిక్షన్ ఇతివృత్తంతో కథలు పంపాలని, భారతీయ సామాజిక జీవన నేపథ్యమే ఉండాలని పేర్కొంది. కథ 1500 పదాలకు మించరాదు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.12వేలు, రూ.7వేలు, రూ.5వేలు. మరో ఆరు కథలకు ప్రోత్సాహక బహుమతిగా వెయ్య రూపాయల చొప్పున బహూకరిస్తారు. ఇవికాక ప్రచురణకు స్వీకరించిన ప్రతి కథకు పారితోషికంతో పాటు కొత్తదనం ఉన్న కథలకు ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారు. కథలను డిటిపి చేసి ఈమెయల్ కు పంపవచ్చు. లేదా జాగృతి వారపత్రిక, కాచిగూడ, హైదరాబాద్ -27కు పోస్టుద్వారా పంపించవచ్చు. చివరి తేదీ ఆగస్టు 31. మరిన్ని వివరాలకు 9959997204 మొబైల్‌లో సంప్రదింవచ్చు.