Others
ఉప్పెన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 7 August 2018
- కెంగార మోహన్, 9493375447
తలుపుల వాకిళ్ళ ముందు
హృదయాన్ని వెనె్నల్లా పరిచాను
నువు కానరావు
కాలాన్ని తెడ్డుగా చేసుకుని
మది సంద్రాన్ని ఎదురీదాను
జాడ కానరాలేదు
నువ్వెంత మోసకారివి
జీవితకాలం నిలిచే
ప్రతిబింబవౌతావనుకున్నాను
రేఖాచిత్రమై
జీవన ముఖచిత్రాన్ని
అందంగా గీస్తావనుకున్నాను
మాటకారితనంతో
హృదిలో గీసుకున్న రంగులచిత్రాన్ని
అమాంతం చెరిపేశావు
నేనిపుడు బాధపడటం లేదు
కన్నీళ్ళన్నీ ఇంకిపోయాక
ఏడ్వడానికి మిగిలింది నెత్తుటి ధారలే
నేనిప్పుడు నీ రూపం చూస్తున్నాను
నీవిపుడు స్పష్టంగా కనిపిస్తున్నావు
మోడుబారిపోయాను
మళ్ళీ నేను చిగురించాలంటే
నువ్వు వానై కురవాలి
జీవన నావై ఒడిని చేర్చాలి