Others
ముందుచూపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 15 October 2018
- మరువాడ భానుమూర్తి
నీ చూపు ఇంకా విస్తృతం కావాలి
ఎప్పటికీ రాని - ఎవ్వరూ కనరాని
రేపటి కోసం రేయింబవళ్లు
ఎంతకాలమని - ఆ ఎదురుచూపు?
ఇంకెంత సేపని ఈ ఏవగింపు
మేలుకో కళ్లు తెరు
వర్తమాన వాస్తవాన్ని
చేదైనా, తీపైనా, ఏమైనా
తనివితీరా ఆహ్వానించు!
తపన తీరా అనుభవించు!
గతమెందుకు అవగతమవ్వాలి?
గతంలోని అనుభవసారాన్ని
వెతుక్కునే ప్రయత్నంలో వృథాగా
వర్తమానం చేజారి పోతుంది
కాలగమనం చేదాటి పోతుంది?
అందుకే అంటున్నా నేస్తమా!
నీకు చూపు కన్నా ముందుచూపు ముఖ్యం
నీకు రేపుకన్నా ఈరోజే నిజం!
అందుకే హెచ్చరిస్తున్నా మిత్రమా
ప్రగతి సాధించాలంటే
ప్రయత్నాన్ని వాయిదా వేయకు
మీనమేషాలు లెక్కించుకుంటూ
కాలయాపనలో కాలక్షేపం చేయకు
కదిలే కాలం తిరుగులేనిది తిరిగిరానిది!!!