Others

ప్రవాహమంత వేగంతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి చుట్టూ
కొన్ని కలలు ప్రవహిస్తాయి!

అలల గుండెచప్పుళ్ళతో
ఉప్పెనలా ఎగిసిపడుతూ
తుపాను రాత్రుళ్ళను వెంటేసుకుని
మనసు మీద
ప్రవహిస్తున్న దృశ్యం!

వేకువ పొద్దు
కళ్ళు తెరిచి చూసినంత మేర
కనీ కనిపించని
అడుగుల గుండెచప్పుళ్ళు!

వీధి గుమ్మంలో
ఏదో తెలియని
గమ్మతె్తైన సందడి!

జానపదుల ఊహల మీదుగా
ఊపిరి పోసుకున్న
ఒక కళాత్మక ప్రపంచం!

తెలుగుదనం ఉట్టిపడే సౌందర్యంతో
కొత్త అనుభవాలను
అనుభూతులుగా పంచుతుంది!

రోజు గడవడమే ఆలస్యం
జవసత్వాల్లోనూ
జీవ కారుణ్యంలోనూ
గోరంతల్ని కొండంతలుగా
చిత్రించే ఈ లోకంలో
నిజమైన కలలెలా బతుకుతాయ!

దృశ్యానికి కూడా
ఒక కొత్త రూపం
ఉండాలి కదా!

మనసు అంచులను తడిమే
మాటల కొసలకు
అద్దిన జీవభాష పరిమళమే
ఈ ప్రాణి ప్రపంచం!

రేపు కొత్త సూర్యోదయం
పుట్టుక రావాలంటే
మానవ మనుగడ రహస్యమే
నిత్య సత్య చైతన్యం!

ప్రవాహమంత వేగంతో
జీవితాన్ని అల్లుకుపోవాలి!

విచ్చుకున్న కలలతో
వికసించిన కళలతో
ప్రభాత వేకువ
కొత్త తరానికి
కొత్తదనానికి
నాంది పలుకుతుంది!

- మానాపురం రాజా చంద్రశేఖర్, 9440593910