Others

ఆకలి మేఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉషోదయపు కిరణాల అలికిడితో
ఆ మేఘాల్లో చలనం వచ్చి
కడుపులో కాలే కాగడాలతో లేస్తాయ
తుపాను బీభత్స దృశ్యంలాంటి
వారి చిరిగిన వస్త్రాలు
ఆకలి హృదయంపై దర్పణపై నిలుస్తాయ

ఏ ఇంటి గుమ్మం వద్దనో
ఏ రోడ్డు చౌరస్తాలోనో
యాచించే ఆ చేతులు
గుండె దోసిటితో తిరగాడే
నిశ్శబ్ద ఆకలి మేఘాలు

ఎన్ని నిరాకరణలనైనా ఆహ్వానిస్తూ
హృదయాన్ని ఛిద్రం చేసే
తిట్ల పురాణాలను సయతం భరించే
ఆ నిరుపేద మేఘాల కనురెప్పల చుక్కలను
తుడవలేని సమాజం
ఇంకా అసహ్యించుకుంటూనే ఉంటుంది

కాల ప్రవాహంలో సజీవ దృశ్యమైన
ఆ ఆకలి మేఘాలు
భవిష్యత్తును నిర్మించుకోలేని అభాగ్యులు
వారి ఆర్తనాదాలు చీకటి వస్త్రంలో కప్పబడి
వౌనంగా విసిరివేయబడుతూనే వుంటాయ
ఇదేనా? మాకు లభించిన స్వాతంత్య్రం
ఆకలేనా... మా ఆశల జీవితం
అనే ప్రశ్న వారి హృదయంలో జన్మించదు

మేడలపైన మేడలు నిర్మించినా
సంతృప్తి లేని అత్యాశ సమాజంలో
వారిది భిన్నమైన పాత్ర
గుర్తింపులేని రెండవ సమాజంగా
వారి చీకటి బ్రతుకుల హక్కులు
గాలిలో దీపంలా నిలబడి వెక్కిరిస్తుంటాయ

ప్రశ్నించని ఆ ఆకలి మేఘాలు
ఈ పుడమి గుండెపై అనాధగా సంచరిస్తూ
సంఘర్షించని ఆలోచనలతో
రక్తకన్నీరుతో విషాదాక్షరాలను
సమాజపు శిలలపై లిఖిస్తున్నారు

- మహ్మద్ నసీరుద్దీన్, 9440237804