Others

బిక్కి కృష్ణ, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరికి కొలకలూరి పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమతి కొలకలూరి భాగీరథి పురస్కారానికి (విమర్శ) ప్రముఖ రచయత బిక్కి కృష్ణ రాసిన ‘కవిత్వం - డిక్షన్’ అనే పుస్తకం ఎంపికైంది. పురస్కార ఎంపికకు ఆచార్య కె. సర్వోత్తమరావు, ఆచార్య ఎస్‌జిడి చంద్రశేఖర్, ఆచార్య ఎం. రవికుమార్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. శ్రీమతి కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారానికి (పరిశోధన) శ్రీ రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి రాసిన ‘నుడి గుడి’ అనే పుస్తకం ఎంపికైంది. పురస్కార ఎంపికకు ఆచార్య జి. దామోదర్‌నాయుడు, ఆచార్య కె. దామోదర నాయుడు, డా. రాసాని వెంకట్రామయ్య న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
ఈ నెల 26న సా. 6 గంటలకు హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో రచయతలకు పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, ఆచార్య కొలకలూరి సుమకిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కారం కింద పదివేల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించనున్నట్లు పేర్కొన్నారు.