Others

మనసు ఖాళీ అవ్వాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృతజ్ఞతో కృతఘ్నతో
ప్రేమో ద్వేషమో
మంచో చెడో ఏదో ఒకటి
లోనిదంతా కక్కెయ్యాలి..

మొన్నటిదీ నిన్నటిదీ
ఇవ్వాళ్టిదీ అంతా
కూడేసుకునీ కుప్పేసుకునీ
మనసెంత బరువైపోయందో

చెప్పాలనుకున్నదేదో చెప్పెయ్యాలి
దాచుకోకుండా దాటవేయకుండా
విప్పాల్సిన చిక్కుముళ్లన్నీ
విప్పేసి స్వేచ్ఛగా ఊపిరి పీల్చాలి
అవును ఇప్పుడే ఈ క్షణమే
మాట్లాడాలి మాట్లాడాలనుకున్నదంతా
చెప్పలేక అవకాశం రాక
దిగమింగుకున్న బరువునంతా
పటాపంచలు చెయ్యాలి
వాయదాలు వద్దు.. వాదోపవాదాలు వదు ద
ఆసాంతం అలవోకగా
కలగలుపుగా ఒంపేసుకోవాలి
మనసంతా తేలికవ్వాలి.. ఖాళీ అవ్వాలి..!

- కటుకోఝ్వల రమేష్, 9949083327