Others
నిర్వచన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 April 2019
- మోహన ప్రసాద్
రాజకీయం సర్వదా ఒక అవకాశవాదం
రాజ్యాంగ ముసుగులో దాగిన మరో వేదం
అన్ని రంగాలను ఆవహించిన పెను ప్రమాదం
స్వార్థపరుల మనుగడకు సదా ప్రమోదం
నయవంచన దీని లక్షణం
మాట మార్చగలదు తక్షణం
పదవి ప్రధాన లక్ష్యం
పాలన మాత్రం సాంతం నిర్లక్ష్యం
సప్తవ్యసనాలకు కీలక కేంద్రం
అవినీతికి అంతులేని సంద్రం
తరతరాలకు తరగని ఆస్తి
వారసత్వంగా సంక్రమించే పదవులు జాస్తి
లాభసాటి వ్యాపారం
మొహమాటం లేని వ్యవహారం
ప్రకృతి వైపరీత్యాలొస్తే అట్టహాసం
కల్లోలిత ప్రాంతమైతే మందహాసం
ఇదే రాజకీయం
చక్కని ఫలసాయం..