Others

నీడలు చెప్పే నిజాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెలుగు నీడలు నలుపు తెలుపుల్లో
కష్టసుఖాలకు గుర్తులుగా
గోడమీద కొబ్బరి ఆకు
మదిని చీల్చే అర్థం లేని విమర్శల జ్ఞాపకంగా
వరండాలో సన్నని స్తంభాలు వరుసగా
న్యాయానికి అన్యాయానికి సూచనగా
జైలు ఊచలని తలపిస్తూ
కాగితంమీద నా చేత పట్టిన కలం
అమ్మాయల ఆత్మబలానికి ఏమాత్రం తీసిపోనట్టు
పిడికిలి బిగించి అవసరమైతే కత్తినవుతానన్నట్లు
సైకిల్‌పై వెళుతున్న బాలుడు
జీవిత పయనానికి ప్రతిబింబంలా
నడుస్తున్న ఓ అమ్మాయ
ఒదిగి ఒదిగి నిటారుగా
మూడు సెకన్ల చిత్రమది
మోటారు సైకిలు జర్రున సాగిపోయంది
వేగం నియంత్రణ అవసరమని ప్రబోధిస్తూ
చెట్ల ఆకులు గుంపులు గుంపులుగా
ఉమ్మడి కుటుంబాన్ని తలపిస్తూ
ఒంటరి కాపురాల్లో కష్టాలను చెప్పుకుంటూ
దిష్టికి కట్టిన అలోవెరా
నీ ఉన్నతిని చూసి ఏడ్చేవాళ్లకు చిహ్నంగా
గోడమీద నా ఛాయే
ఏమీ చెప్పనట్లు... ఏమీ తెలియనట్లు
సృష్టి రహస్యంలా!!

- యలమర్తి అనూరాధ