Others

గజల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌనమెంత కురిసి
యంత భావవౌతుంది
భావమెంత కరిగి
కొంత వేదనవుతుంది

మాటలన్ని గొంతులోన
వింతలౌతుంటే
వింతలన్ని ఊహలోన
మాటలౌతున్నవి

గుండెలోన దాగివున్న
మధురమైన వేదన
ఎదలోన మిగిలివున్న
అమరమైన రోదన

కన్నీరు కారి కారి
గాయవౌతున్నది
ఇన్నాళ్లు వేచి వేచి
అలసటవుతున్నది

చేదు కొరకు తిన్న వేప
తీయనవుతుంది
మరపు మరచి
మనసా మూగనైపోతుంది

- ర్యాలి ప్రసాద్, 9494553425