Others
యోగ్యతలున్నచోట...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 April 2019
- డా. కొల్లు రంగారావు
గుండెల్లో గుబులు
వెన్నులో వణుకు
మనసంతా దిగులు
కన్నీటి ప్రవాహమై
ప్రతిబింబిస్తున్నట్లు
ఎవరి కోసం
ఎంత పిచ్చితనం కాకపోతే
చేతులకు చూపా
ఎంత వెర్రితనం కాకపోతే
కాళ్లకు వినికిడా
అసలు విషయం తేల్చడమా
అనుక్షణం నాన్చడమా
ఎవరినైనా ఎంతకాలం
అయష్టంగా
నెత్తిపై వుంచుకోవడం
ఎవరినైనా అయష్టంగా
పాతాళానికి నెట్టివేయడం
ఎవరో ఒకరిని బలవంతంగా
నింగికెత్తడం అవసరమా?
యోగ్యతలున్నచోట
ప్రతి క్షణం ప్రమోదగీతం
ప్రబోధమై వినిపిస్తుంది
ప్రగతివైపు పరుగులు
లక్ష్యంగా జనాన్ని మేల్కొలుపుతుంది.