Others

చేప విలాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేనొక ఎత్తిపోతల దగ్గర నిలుచున్నా
ఇక్కడ అధికంగా ఉన్న నీరంతా
మా బీడు భూముల్ని తడుపుతాయని
మా రైతన్న కన్నీటిని తుడుస్తాయని
కలలు కంటూ నిలుచున్నా

ఇంతలో ఓ చిన్నారి చేప
నా ముందుకొచ్చి మాట్లాడింది
నా కన్నీరు నీకు కనిపించదు
నేను జలం లోపలే ఉన్నందుకు
అంటూ తనను తాను
పరిచయం చేసుకుంది

నీరు వర్షం ఎరుగనోళ్ళం
నది ఎప్పుడో మా దారిలో పారిందని
చెప్పే పెద్దోళ్ళ మాటలతో మా దగ్గర
నీటిని ఊహించుకుంటున్నాం
అందుకే ఓసారి చూసిపోదామని
వచ్చాను నా చిన్ని చేపా అన్నాను
ఈ నీళ్ళు మా పొలాల్లో
పారతాయని సంతోషం అన్నాను

నీకు ఆనందమే కాని
మాకు దుఃఖం తెలుసా
ఈ మట్టితో ఈ కొండతో
ఈ చెట్లతో ఈ గాలితో
ఈ మనుషులతో జీవులతో
తరతరాలుగా పెనవేసుకున్న
మా బంధం తెగిపోతుంది
ఈ భూమిపైనే లేకుండా
పోతాం మేము తెలుసా

చిన్ని చేపా
నా సంతోషాన్ని
ఆవిరి చేయకు
మా బతుకులు బాగుపడతాయని
కలగంటున్న ఈ తరుణంలో
నీ కన్నీరు చూడలేను
సంతోషం విచారం
నాణేనికి రెండువైపులా
నీకు మాటిస్తున్నా
నిన్ను కాపాడే
ప్రయత్నం మాత్రం చేస్తా
అన్నాను అప్రయత్నంగా
ఈ ప్రపంచంలో ఎన్ని వైరుధ్యాలో
అని లోలోన అనుకుంటూ!!

- జంధ్యాల రఘుబాబు, 9849753298