Others

కోకిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొమ్మకొమ్మన చేరి కోయల కూనిరాగము తీసెనే
కమ్మకమ్మని రాగముల్ గమకంబు తోడుత పాడెనే
రమ్మురమ్మని పిల్లలందరు రాచమామిడి చూపిరే
చెమ్మగిల్లిన మానసంబున చింతలన్నియు తీరెనే!

గున్నమామిడి పచ్చపచ్చని కోక పొంకము గాంచుచున్
వనె్నచినె్నలెరింగి రివ్వున వాలిపోయెను తోటలోన్
ఎన్నరాని స్వరంబుతో భువికెంత సంబరమయ్యెడిన్
చెన్నుమీరె వసంత రాగము చెట్టుచెట్టున చేరగన్

నమ్మబోకుము నన్ని కొమ్మల నాగులుండును మెండుగన్
తుమ్మతోపుల కంటకంబుల దూకుచున్ పయనించకన్
సమ్మతంబగు చోటుకేగుచు స్వాగతించుము ఆమనిన్
నిమ్మలంబుగ నుండు కోయల నిల్వబోకుము కాకలోన్

గ్రామ సీమల వీడి తిన్నగ గాంచు పట్టణవాసులన్
ప్రేమ మీరగ రాగరమ్యత పెంపునొందును ధాత్రిలోన్
ధూమమందున సంచరించకు దూలనాడకు లోకులన్
క్షేమమన్న మహీజమందున చేరి పల్కుము తీపిగన్

చెట్టుచేమలు పట్టుతేనెలు చేర్చి కంఠము నింపెనో
పట్టరాని మధూళి నిండుగ ప్రాణరంధ్రము చేరెనో
గట్టుగన్ శ్రుతదేవి వీణియ గూర్చి రాగము నేర్పెనో
పిట్టవైనను కూతకెంతటి పేరు నిల్చెను కోయలా!

- డేగల అనితాసూరి, 9247500819