Others

ఉపనయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విప్రోత్తమా! విన్నవించుకో
ఏంకావాలో’ అని అడిగిన ఏలినవారికి
‘కొమరుని వివాహం, నాకు ఉపనయనమన్న
వృద్ధ విప్రునికి ‘ఉపనయనమిప్పుడేమిట’ని
విస్తుపోయిన ప్రభువుల వారికి
ప్రహేళికగా తోచింది !
‘రాయల’ వారి లాంటి రాజుకి తట్టినదే
నాకూ స్ఫురించిన శే్లష -
సర్వేంద్రియణాం
నయనం ప్రధానమనే
నయనానికి ఉప నయనమని
అన్వయించుకుంటే --
ఉపాధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి,
ఉపవాచకం, ఉపకులపతి, ఉప ఎన్నిక
ఉపనాయకుడు, ఉపనాయకి,
ఉపాహారం, ఉపనగరం, ఉపసంఖ్యానము
వరుసలో ఉప నయనమని!
నయనానికి అదనం, ఆసరా అనిపించింది.
వార్ధక్య సమీపస్థులకు
సమవర్తి హెచ్చరిక సంకేత
చత్వారానికి ‘‘చష్మే’’....!
శిరోభార నివారణకు సులోచనాలు
కంటి వ్యాధి వ్యాప్తి నివారణ కవచం.
ముఖవర్చస్సు, గౌరవాన్ని ఇనుమడింపచేసేది
మరచిపోయే వాటిలో
మరొకటి ‘‘ముక్కద్దాలు’
మరపుకు తావివ్వక
మెడకు వేలాడతీయబడేది.
కంటిమాటల భావాలను మరుగుపరచే
కంటి అంద్దాలు,
కండ్లజోడుతో విన్యాసాలు చేసే
వృద్దకళాకారుల కళ్ళక్రింద
క్యారిబ్యాగులను కవర్ చేసే
కూలింగ్ గ్లాసులు
రంగుటద్దాలతో
రంగు రంగుల లోకం
బహు బాగుందని, భ్రమించక
ఆత్మ, బాహ్య పరిశుద్ధతా సంకేత
మహాత్ముని స్వచ్ఛ, శే్వత ఉపనయనాలతో
సత్యాన్ని పరికిద్దాం.

- వేదం సూర్యపక్రాశం 9866142006