Others

పరువు హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాడు
కూతుర్ని చంపి
కులానికి వేలాడదీశాడు
మతానికి మానవతను వెలేసినోడు
నిజానికి మనిషినని మరిచినోడు

వాడో హంతకుడు
వాడి ఉరికొయ్య మీసాల్ని
రొయ్యలతో పోల్చకండి
ఇంకా మెలేస్తాడు
దర్జాగా దువ్వి రక్తం పూస్తాడు
నీచకృత్యాన్ని పరువు హత్య అనకండి
మనసు బరువెక్కుతుంది
రక్కసి చేతలకు చక్కెర మాటలెందుకు?
విషపూరిత చర్యలకు
విశేషణాలెందుకు?

హత్యలో పరువెక్కడుంది?
నికృష్ట చేష్టలో ప్రతిష్ట వుంటుందా!
పరువు హత్య కాదది.. క్రూర కుల హత్య
నేరస్తుడు వాడే అయనా,
మూగ సమాజమే అసలు ముద్దాయి

- డా. డి.వి.జి. శంకరరావు, 9440836931