Others

మహా క్రతువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నీళ్లే...
ఆనందంలో రాల్చేవి బాష్పాలు
దుఃఖంలో రాల్చేవి అశ్రువులు
భావోద్వేగాలు చేసే... మహా క్రతువు

చెట్లు... మోడుబారుతవి
చిగురించి ఆశలు రేపుతవి
ఋతుచక్ర గమనమే...
మహా క్రతువు

భూమి... బీటలు వారుతుంది
దండిగ పండి జగతికి ఇంధనమవుతుంది
మేఘం ప్రసవ వేదన...
మహా క్రతువు
అగ్ని... చైతన్యం రేపుతుంది
చీకట్లను పారద్రోలుతుంది
జీవశక్తి... మహా క్రతువు

మనిషి తన అవలక్షణాలను అర్పించాలి
సౌభాగ్యాలను ఆశించాలి
అదే... లోకకళ్యాణ మహా క్రతువు

- మేకిరి దామోదర్, 9573666650