Others

మానవుడే ఓ సునామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మనిషి నిర్వాకం కాకుల్ని తోలేసింది;
వాణ్ణి ఏకాకిగా మిగిల్చింది;
పిచ్చుకల కిచకిచల్ని ఇప్పుడనే్వషిస్తున్నాడు;
అది వఠ్ఠి పిచ్చి కల!
ఈనాటి పారిశ్రామికీక‘రణం’
ఏనుగుల్ని పీనుగుల్ని చేసింది;
వాడి బతుకుని పీనుగు పెంట చేసింది;
ఖఊళ్ళపైకి ఉరికి చిరుతపులి
విధ్వంసాన్ని సృష్టిస్తోందంటే
కారణం - ఈ మేకవనె్న పులే;
చేప ప్రమాదం హోరు
ప్రస్తుతం చాపక్రింద నీరు;
ఎరువులూ, పంట జన్యువుల మార్పిడి
జీవిత సౌఖ్యానికి వేస్తోంది పిడి;
ప్రకృతి పచ్చదనాన్ని వికృతి చేసే
మానవుడే ఓ సునామీ;
వాడు స్వార్థానికి తిరుగులేని హామీ;
అసలు మనిషి ఎప్పుడో భస్మాసురుడయ్యాడు
వాడి నెత్తినే వాడు చేయ పెట్టుకోబోతున్నాడు;
ఇప్పటికైనా మించిపోయంది లేదు;
ఈ ప్రళయ నివారణకు ప్రతి వ్యక్తి నడత
ఉన్నంతలో కావాలి ఉడుత.

- విశాఖ, 9866944287