Others
జమానా బదల్ గయా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 19 August 2019
- డా. ఎన్. గోపి

తరాలు మారినప్పుడల్లా
ఆకాంక్షలూ మారుతాయి.
ప్రవహించే కొద్దీ నదులకు
కొత్త పేర్లు మొలుస్తాయ
కనపడదు గాని
నిశ్శబ్దం కూడా కదుల్తుంది.
నిన్న నువ్వు పాడిన పాట
ట్యూన్ మార్చుకుంటుంది.
అర్థం అదే
సారాంశం మారుతుంది.
ఒకప్పుడు ఇల్లు
ప్రపంచమంత విశాలంగా ఉండేది,
ఇప్పుడు చిన్నగానే కాదు
చిన్నబోయ కూడా చూస్తుంది
జ్ఞాపకాలు
చేతిలోని నీళ్లగ్లాసులా
భళ్లున జారిపడతాయి.
ఒలికిన నీళ్లలో
ఏవేవో ప్రతిబింబాలు!
తరాలు మారినప్పుడల్లా
అవసరాలూ మారుతాయ
చూపులు అవే
దృష్టికోణాలు తడబడతాయి.
కొంచెం బాధే
కాని తప్పదు
కొనసాగింపు ఇంపేకాని
అది కొత్త గుంపుల్లో ఒంటరిదవుతుంది.
తరాలు మారుతాయ గాని
వౌలిన స్పందనలు
మరో శ్రుతిలో కొట్టుకుంటాయి.