Others
రాతి పువ్వు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 26 August 2019
- తిరునగరి శ్రీనివాస్, 8466053933

వెతికేకొద్దీ
విశే్లషణకు అందని పరంపరలు
రూపాలేమిటో తెలియదు
అంతా అంతరంగ మథనమే...
దేహ పంజరం నిండా
అనియంత్రణలు
అనిర్వచనీయాలు
ముద్రాంకితాలు
సజీవ జీవన కళలు
తుడిపివేతలకు మాసిపోవవి
మననాలై ముందు నిలుస్తాయ
అసంకల్పిత పరితపనలెందుకు?
అవి పూసేవి సహజాతాలనే...
నిట్టూర్పులకు సెలవిచ్చి
ప్రాణాన్ని చిక్కబట్టి
విముఖాల చూపులను తప్పించుకుని
ప్రవాహ చారికలను ప్రస్తావిస్తూ
దీపాల నగిషీలను
శిఖరాల ముంగిళ్లలో చెక్కాలి
కన్నీటి పేటికల్ని
రాసుకున్న వాక్యంలో
అనుభవాలుగా పేర్చాలి
ప్రతి రాపిడిలో రాతిపువ్వుగా మారాలి
పోరాటంలో వెనె్నముకై మెరవాలి
సుదీర్ఘ నిరసనల్లోనూ
చైతన్య నినాదంగా ప్రభవించాలి