Others

నగరంలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరుకు గదుల్లో నుండి
ముత్యం లాంటి అక్షరం
నవ్వులు నవ్వులుగా భూమిపై పొర్లగానే
ఒక పెద్ద కొండ తన గాయాన్ని
ఒత్తుకుంటూ కనబడింది
గాయం అంటే
అలాంటి ఇలాంటి గాయం కాదు
భవిష్యత్తును మింగేసిన గాయం

భళ్లున చిందిన చెమట చుక్కలో
అతను దాచుకున్న జీవితాన్ని చూశాను
అక్షరం అక్షరాల్లో చిందరవందరగా తిరుగుతుంటే
లెక్కలేనన్ని పాలపుంతలు
శూన్య కొమ్మ నుండి రాలిపడినట్లు అనిపించింది

కొన్ని అక్షరాలు గాల్లోకి ఎగిరినప్పుడు
గతాన్ని జారవిడుచుకున్న అలజడి
అక్షరాల గొంతుల్లో సంగీతం ఊగినప్పుడు
ఆ పక్క శబ్ద శ్మశానం ఉలిక్కిపడింది.

శిల్పాలు మనుషులను కలపడాన్ని
మనసుల్లో మొక్కలు నాటడాన్ని
పువ్వులు పువ్వులుగా ఆహ్వానిస్తాను
కానీ రాళ్లపై అక్షరాలను ఎలా చల్లేది?

అక్షరాలు నా కనుపాపలో పూసిన పసిడి
నుదిటిని ముద్దాడే సీతాకోక చిలుకలు
మూడువేళ్ల మధ్య నుండి ఎగిరే పావురాలు
అరచేతుల్లో నిదురించే బుజ్జిపాపలు

జాతరకు జేజేలు
జాతరలోని జనాలకు జ్ఞానకేకలు
మూర్ఖత్వానికి పిడిగుద్దులు

- అఖిలాశ, 7259511956