Others
కాలమూ - రాజ్యమూ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 2 September 2019
- కోట్ల వెంకటేశ్వరరెడ్డి, 9440233262

కాలం
ఎంత నిర్దయనో
రాలుతున్న పండుటాకునడగాలి
ప్రాయమున్నంతకాలం
ఎన్ని చిందులు వేసినా
పత్రాన్ని హరిత పతాకం చేస్తది!
పూల మధ్య
రసభరిత ఫలాల నడుమ
రాజ్య వైభవాన్ని అంటగడ్తది!
మండుటెండల్లో
పచ్చని గొడుగును చేసి
ప్రాభవాన్ని వెదజల్లుతది!
విస్తరిస్తున్న కొద్దీ
అమ్మతనాన్ని అంటగట్టి
అజరామరత్వాన్ని రాసిస్తది
ఆయువు తీరిందా
నిశ్శబ్దంగా తుంచేసి
గాలిని అంతిమ యాత్రకు పురమాయస్తది!
పక్షి ఆకాశమే సాక్షి
భూతల్లొక్కతే తన అంశను
తిరిగి తనలో లీనం చేసుకుంటది!
రాజ్యమూ అంతే
తలూపినంత కాలమే
నెత్తిన కిరీటం పెడ్తది!
ఒకసారి ముద్ర పడిందా
నీ దేశభక్తి నిరూపణకు
ఏ అగ్నిగుండమూ మద్దతు పలకదు!