Others
కొత్త కవిత్వం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 2 September 2019
- సాంబమూర్తి లండ, 9642732008

నీకు తెలియని గొంతేదో
నిన్ను పిలుస్తుంటుంది
దీనంగా!
నువ్వు చూడని చూపేదో
నిన్ను వెంబడిస్తుంటుంది
నీడలా!
నువ్వు పిలవని పిలుపేదో
నీకే ప్రతిధ్వనిస్తుంటుంది
ఆర్తిగా!
అక్కడేముంది...
మర మనుషుల మధ్య?!
కుళ్లిన మనసుల మధ్య
ప్లాస్టిక్ నవ్వుల మధ్య!
శుష్క వాగ్దానాల మధ్య!
నాగరికత మృగ్యమైన
నగరాల ఎడారుల్లో...?
నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న
వేల ప్రశ్నలకు
జవాబులు వెతుక్కుందాం రా!
అడవి దాపున పల్లెల్లోకి
ఆకాశపు అరుణిమల్లోకి
వాదం వేదమైన లోకంలోకి!
గాయపడ్డ సూరీడికి
నూతన జవసత్వాలనిద్దాం!
గుండెల నిండా కొత్త గాలిని పీల్చుకుని
హోరెత్తే సంద్రాన్ని కలంలో నింపుకుని
కొత్త కవిత్వాన్ని రాసుకుందాం...