Others

స్వచ్ఛంద మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెడ మీద అగుపించని
కత్తి వేలాడుతుంది

వ్యక్తిత్వాలను నిరసించే కాలం
ఉనికిని గుర్తించని వ్యవస్థ
‘నేను’ను నిట్టనిలువునా
పాతరేసే సమయం

ఆకాశం అంతా
కారుచీకట్లు కమ్ముకుంటాయ
బలవంతం ఏమీ లేదు
అంతా నీ ఇష్టమే

కాలానికి ఎదురొడ్డుతావో
కాలంలో కాటకలిసి పోతావో
బాధను జెండాగా స్వీకరిస్తావో
వివాదంలో పలాయనం చిత్తగిస్తావో
జుర్రత్ ఏమీ లేదు నిర్ణయం నీదే
మంచైనా చెడైనా మోసేది నీవే

ఇవ్వాళ్ళ చూపుడు వేలు
చూపును కోల్పోయ విరిగిపోయంది
నేడు అడగకముందే
ప్రశ్న తలదించుకుని పశ్చాత్తాపం ప్రకటిస్తుంది

ఎన్ని చెప్పినా
సమర్థనే అవుతుంది కానీ
సమాధానం కానేరదు

ఒక ఒరలో రెండు కత్తులు
ఇమిడి పోవాల్సిందే
ఎంత ఎత్తులకు చేరినా
నేల పొత్తిళ్ళలో చేరాల్సిందే

నా చుట్టూ లోపలా
మీకు కనబడని హింస
నా వాతావరణం అంతా
ఏ ఒక్కరికీ వినిపించని
అనుభవిస్తే కానీ అర్థం కాని
అనుమానం చూపులు
థర్డ్ డిగ్రీ థాట్ పోలీసింగ్

సంగడికాడా!
ఈ కవిత నిన్ను చేరేసరికి
నేను మరణించి వుంటాను
లేక చచ్చి నేల చూపులతో
ఆత్మగౌరవ తోక ఆడిస్తూ వుంటాను

- జూకంటి జగన్నాథం