Others

తలవంచుకు పోదామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటుచూసినా దగా, మోసం
రాజ్యమేలుతుందేమో అహం, స్వార్థం
అంతులేని ఆర్తనాదాలు
అర్థం కాని ఆకలి కేకలు

విస్తీర్ణంలో అతి పెద్ద దేశం
ప్రపంచంలో అతి పేద దేశం
అవినీతిలో ముందుంటాం
ఐక్యతలో చిట్టచివరుంటాం

దేశమంతా రాజకీయ నిరుద్యోగులే
చేసేవేమో బడా వ్యాపారాలు
చెప్పేవేమో నీతి వచనాలు
కట్టేవన్నీ అవినీతి కోటలు

గెలిచే వాళ్లెప్పుడు ఉన్నవాళ్లే
పోరాడి, ఓడేవాళ్లు పేదవాళ్లు
చిరునవ్వులన్నీ కుబేరులవే
కన్నీళ్లన్నీ కర్షక కార్మికులకే

ప్రాంతానికో పార్టీ, మతానికో పార్టీ
పార్టీలకు జెండాలు వేరైనా, అజెండా ఒక్కటే
ప్రజల్ని మోసం చేయడంలోనే పోటీ
చెప్పేవన్నీ అమలుకాని హామీలు

తలవంచుకు పోదామా
తలెత్తుకు పోరాడదామా
సమూల మార్పుకి అడుగేద్దామా
సమస్త జనులను మేల్కొలుపుదామా..

- రాజాకిరణ్ తుమ్మల 9000092200