Others
ఒక్కరే.. మీరొక్కరే!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 October 2019
- బులుసు సరోజినిదేవి, 9866190548
![](http://www.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/7h2.jpg?itok=BSqD5iWa)
జనం జనం
గుంపులు గుంపులు
వస్తున్నారు
కదిలిపోతున్నారు
నవ్వారు.. ఏడ్చారు
ఏమయంది నిన్నటిదంతా?
ప్రేమించారు.
ఒక్కటనుకున్నాను
రెండని వేరయనప్పుడు
దిగంతాల దుఃఖం
ఆలోచనా తరంగాలు
వేలకి వేలు.. వస్తూ పోతూ
మనసు నిండా జ్ఞాపకాల ముద్రలు
కలలు.. కలలు
తియ్యనివి కమ్మనివి
మరొక్క కొత్త జ్ఞాపకం
నిన్నటిదయపోయంది
చూపు గగనానికి ఎగిరి
నేలమీద చటుక్కున వాలుతుంది
ఒక్కటనుకున్నా
రెండుగా విడిపోతుంది
ఒక్కరే.. ఒక్కొక్కరు
అందరూ కలిసి ఒక్కరొక్కరు
కదులుతున్న చిత్రాలు
రెండుండవు
ఒక్కరే.. మీరొక్కరే!