Others

20న ఓల్గాకు శిఖామణి సాహితీ పురస్కార ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్యంలో జీవన సాఫల్య కృషికి సాహిత్య సాంస్కృతిక సంస్థ కవిసంధ్య ఇచ్చే శిఖామణి సాహితీ పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ రచయత్రి ఓల్గా ఎంపికయ్యారు. అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం యానాంలో జరిగే కార్యక్రమంలో ఓల్గాకు పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు కవిసంధ్య కార్యదర్శి దాట్ల దేవదానంరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శిఖామణి కవితా సంపుటి ‘యానాం కవితలు’ ఆవిష్కరణ జరుగుతుంది. అవార్డు ప్రదానోత్సవానికి మంత్రి మల్లాడి కృష్ణారావు, డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కె.శివారెడ్డి, డా. డి.విజయభాస్కర్, ఖాదర్ మొహియుద్దీన్, డా. ఆర్. సీతారాం, డా. కె.ఎన్.మల్లీశ్వరి, మధునాపంతుల తదితరులు పాల్గొటారు. డా. ఆలూరి విజయలక్ష్మి, ఎల్.ఆర్.స్వామి, అదృష్టదీపక్, శాంతినారాయణ, భూసురపల్లి వెంకటేశ్వర్లు, సన్నిధానం నరసింహశర్మ, మువ్వా శ్రీనివాసరావు, గూటం స్వామి ‘కవిసంధ్య ప్రతిభా పురస్కారం’ అందుకుంటారని ఆ ప్రకటనలో తెలిపారు.