Others

14న నారంశెట్టి బాల సాహిత్య పురస్కార ప్రదానోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2019 సంవత్సరానికి గాను నారంశెట్టి బాలసాహిత్య పురస్కారానికి డీ.కే.చదువుల బాబు, పైడిమర్రి రామకృష్ణలను ఎంపిక చేసినట్లు నారంశెట్టి బాలసాహిత్య పీఠం ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు అధ్యక్షతన నవంబర్ 14న విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగే సభలో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. పురస్కారం కింద ఐదువేల నగదు, జ్ఞాపికతో సత్కరించనున్నారు. ఈ సభకు అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత ఎల్.ఆర్.స్వామి, ఏపీ సాహిత్య అకాడమీ సభ్యులు కత్తిమండ ప్రతాప్, అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ తదితరులు హాజరుకానున్నారు.