Others
మరు జన్మ దివ్యకావ్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చిన్ని పువ్వా, క్షమించు!
మహా వృక్షాన్ని అనుకున్నాను,
ఒక సుకుమారమైన పచ్చని మొక్కను కాకపోతిని...
ఓ బుజ్జి నీటిబిందువా, క్షమించు!
మహా నదిని అనుకున్నాను,
ఒక చిటపట వాన చినుకును కాకపోతిని..
ఓ చిరు నిప్పురవ్వా, క్షమించు!
మహా సూర్యబింబాన్ని అనుకున్నాను,
ఒక మంగళ దీపాన్ని కాకపోతిని...
ఓ పసి గులకరాయా, క్షమించు!
మహా పర్వతాన్ని అనుకున్నాను...
ఒక దారికి పనికొచ్చే రాతి ముక్కను కాకపోతిని...
ఓ నా బంగారు మనసా, క్షమించు!
మహా దేవుణ్ణి అనుకున్నాను,
ఒక మనసున్న మనిషిని కాకపోతిని...
చావు పుట్టుకలు లేని స్వర్గం నాకొద్దు,
రాతిగానో, నాతిగానో, పుల్లగానో, పులిగానో...
విశ్వంలోకి మళ్లీ రావాలి,
ప్రకృతిని గుండెతో సేవించుకోవాలి
ప్రజల్ని మనసుతో పూజించుకోవాలి
మరో జన్మ అనేది
మనిషికి మరో వరంగా లభించే దివ్యకావ్యం.