Others
ఎడారి స్వప్నం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 November 2019
- విజయలక్ష్మీ నాగరాజ్, 9966559567

వేలాడే తోటల్లో
మధురాలను అనే్వషిస్తూ
తనది కానిచోట
తన ఉనికికై
ఉన్నతికై...
వేసంగి సుడిగాలుల్లో రేగుతున్న
ఇసుక తుపానులో
చెల్లని కాగితమల్లే సుడులు తిరుగుతూ
ఆత్మాభిమానం తాకట్టులో చేస్తోంది
గులాంగిరీ!
దిగులు కూడా దిగాలుగా
తరచి తరచి చూస్తుంటే...
దిక్కు మొక్కు కానరాని
సైకత సామ్రాజ్యంలో
రెక్కలు నరుక్కున్న తలరాతతో
స్వీయ ఖైదీలా మసలుతున్నా...
గుండెల్లో గుప్పెడు ఆత్మీయతకై ఆరాటం
జానెడు జాగాను నింపే బాధ్యతల్లో
గడియ గడియ అలుపెరుగని పోరాటం
రెప్పల చాటున ఉప్పెనలను దాచి
తనవారి శ్రేయస్సుకై చేస్తోన్న తపం!
నీటి చెమ్మ దొరకని చోట
కన్నీటి చెమ్మతో...
ఎండమావుల నింపుతూ
స్వప్నలోకపు దారుల్లో
హరివిల్లుకై
వేటలో అలుపెరగక సాగే తాను
ఓ.. బహుదూరపు బాటసారి!