Others
లంబసింగి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 December 2019
- సిహెచ్. అరుణ్ కుమార్ 8106863054
నిషాల నిశిలో తుషార జల్లుల్లో
తూర్పు కనుమల కోమలాంగి సిగలో
తురిమిన ధవళ పుష్పాంగి లంబసింగి
మంచు కౌగలి వీడుతున్న 3అరుణు2డి
సొగసు చూస్తే నారింజ కనకాంగి
చలికి వణికి పెదాలు పొణిగే
వింతభాషకి అక్షరాలుపొదిగి
గొంతుపలికే రాగాలకు
తలలూపే వృక్షాల లతాంగి
మంచును కళ్లతో కొలుస్తూ
లంబసింగి అందాన్ని చూస్తుంటే
తనివితీరని సుధాంగి
అద్భుతమైన సుందరాంగి
మనసును మత్తుగా మాయచేసే
సౌందర్య హిమాంగి లంబసింగి
విశాఖ మన్యం
ప్రకృతి ప్రేమికుల ఆకలి తీర్చే స్తన్యం
విశాఖ మన్యం
సౌందర్య ప్రేమికులు పాడుకునే పద్యం