Others

తడి ఆరని సంతకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక బాలుడు
నల్ల మట్టి తెచ్చి
నీళ్ళతో ముద్దచేసి
బొమ్మచేశాడు
తల, మెడ, బొజ్జ
కాళ్ళూ, చేతులూ అన్నీ పెట్టాడు
ఇదే నా కవిత్వం- అన్నాడు కవి

సాహిత్యపరంగా ప్రతి కవీ పసివాడే
పసివాడిగానే తన కవిత్వం మట్టితో
బొమ్మలు చేస్తాడు
చేయాల్సిన సుదీర్ఘ ప్రయాణంలో
ప్రతి కవితా ఒక తొలి దశే-
ఇంతకీ అదేం బొమ్మ?
అది ఎవరి బొమ్మ?
ఏ రంగు బొమ్మ?
అది ఏం సూచిస్తోందీ?
పాఠకులకు అదేం చెపుతోంది?
ఎవరికివారు తేల్చుకోవాల్సిందే
కవి ఊహలు, ఆలోచనలు
నిరంతరం రాటుదేలాల్సే ఉంటుంది
పథం, దృక్పథం ఎప్పటికప్పుడు
రూపుదిద్దుకోవాల్సే వుంటుంది

చేస్తా, తీస్తా, పొడుస్తా అని
కోతలు కోయడం కన్నా..
వినయంగా అంకితభావంతో
అడుగువేసి ప్రారంభించడమే
గొప్ప సాహసం కదా?
సాహసి కాలేనివాడు కవే కాలేడు
స్వేచ్ఛకోసం కలాన్ని కత్తిలా తిప్పలేనివాడు
సాహసి ఎలా అవుతాడు?
సంతకం - హస్తాక్షరి
ఒక వ్యక్తిత్వపు ముద్ర
కవికి మాత్రం కవిత్వమే ముద్ర
అది ఎప్పుడూ
తడి ఆరని సంతకం!

- డాక్టర్ దేవరాజు మహారాజు