Others
మఖ్దూం మొహియుద్దీన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 9 March 2020
-తిరునగరి శరత్ చంద్ర

ఉర్దూ భాషలో గులాబిపువ్వై గుబాళించెను మఖ్దూం
గజల్ సొగసుల బాహార్ తానై పసందు చేసెను మఖ్దూం
గుల్ మొహర్‌లా ప్యార్ గజల్‌లా ఖుషీలు ఎన్నో చేసి
ముషాయిరాల నవాబులాగ ప్రకాశించెను మఖ్దూం
మైఖాద్‌లాగ మత్తెక్కించే షేర్‌లను మాత్రమే కదా
ఉడుకెత్తించే నెత్తుటి గీతం తానై వెలిగెను మఖ్దూం
దిగాలుపడుతూ ముందుకు సాగే అనాధ బ్రతుకుల చూసి
కార్మిక నాయక వీరుడు తానై పతాకమెత్తెను మఖ్దూం
చీకటి ముసిరిన తెలంగాణలో ‘సుర్ఖ్ సవేర’యై లేచి
దోపిడి బుద్ధుల అరాచకాలకు సమాధి కట్టెను మఖ్దూం
మీర్జా గాలిబ్, మహ్మద్ ఇక్బాల్, షాజఫర్‌లు కలిసి
తనలో మెరవగ కవితై కురిసి కదిలిసాగేను మఖ్దూం
నీ కవితకు సలాము చేస్తూ ఇస్తున్నా ఈ నజరానా
‘శరత్’ గజల్‌గ మజాలు చేస్తూ కనిపించేను మఖ్దూం