Others

చీకటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూసుకున్న కనురెప్పల మాటున
కల ‘వరమవుతున్న’
విశ్రాంత సమయాలను
జోకొడుతుంది
కోరుకున్నదందక పగిలిన
మనసు ముక్కల్ని అతికించే పనికే
పునరంకితమైనట్లుంటుంది.
నిన్ను వదిలెళ్లిపోయిన స్నేహఋతువుని
బుజ్జగించి కొత్త అంకుర నిర్మాణానికి ప్రోత్సహిస్తూ
ఏకాంత ఆత్మావలోకనకు పురిగొల్పి
ప్రకృతిని సైతం సడిసేయవద్దంటూ
సమాధి స్థితిని ప్రోత్సహిస్తుంది.
కలసిన కడలి ఆంతర్య ఘోషతో
పర్వత సానువుల కాఠిన్యాన్ని కరిగిస్తుంటే
రెంటి అంతరాగాలకూ స్వస్థత చేకూరుస్తూ
ఆర్ద్ర పంచుకునే ఆత్మీయ సమావేశానికి
ఏకాంత సమయాన్ని ప్రసాదిస్తుంది
సమస్త ప్రాణికోటి అలసినతనాన్ని
తన అస్తిత్వానికి పులుముకుంటూ
కోల్పోయిన ప్రశాంతతను
వెండి గినె్నలో దాచి
అరుణ కిరణాలతో సహా
నలిగిన మనసున పేజీని మరమ్మతు చేసి
తిరిగి తీసుకొస్తుంది.
తను మాత్రం రాత్రి చేయబోయే
మంత్రాంగాన్ని కలగంటూనే
పగలే కాస్త కునుకేస్తుంటుంది.

-గొర్తి వాణిశ్రీనివాస్.. 9441345651