సాహితి

పోరాట ప్రార్థన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాషలేని తనం,
గొంతు లేని తనం,
తలపాగా లేని తనం
ఈనాటి శాపాలు
ఈ దేశానికి
బ్రహ్మశాపం లాంటి
ప్రపంచ బ్యాంకు పుణ్యమా అని!
ఎన్ని ముక్కలయ్యాయో,
ఎన్ని ముద్దలయ్యాయో,
జన శరీరాలు
తపస్సులు చేసే, చేసే,
జపాలు జరిపే జరిపే,
యుద్ధాలు చేసే చేసే,
భారతావని బాలసారకి!
***
భూగర్భ శాస్త్రానికి అందే విజ్ఞానంలా
ఈ దేశం ఇప్పుడు
ఓ గుహగా మారిపోయింది!
విహార యాత్ర లాంటి
వాణిజ్య యాత్రలకి
బోర్డులు వేలాడదీస్తుంది!
పుట్టుకనీ, చావునీ,
సమస్త హత్యలనీ, ఆత్మహత్యలనీ
విహార యాత్రలగానే ప్రచారం చేస్తుంది!
***
మొలకలు, మొలకలుగా
చిగుళ్లు, చిగుళ్లుగా
చేతులూ, కాళ్లూ
మొలవాలనీ, మెరవాలనీ
మరి మరి ప్రార్థన
పోరాట ప్రార్థన
ఇది ప్రార్థనా పోరాటం

- ఒబ్బిని, 9849558842