జాతీయ వార్తలు

పాలమూరు, డిండి ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఉండకూడదని తేల్చింది. వీలైనంత త్వరగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ వివాదాన్ని పరిష్కరించాలని సూచించింది. తెలంగాణలో పాలమూరు, డిండి ప్రాజెక్టుల నిర్మాణంపై కృష్ణా జిల్లా రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి తెహర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించి పలు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులే ఇప్పుడు నిర్మిస్తున్నామన్న తెలంగాణ వాదనతో ఏపీ ప్రభుత్వం విభేదించింది. డిండి ప్రాజెక్టుల డీపీఆర్‌లను తెలంగాణ ప్రభుత్వం సమర్పించలేదని, ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని కేంద్రం కోర్టుకు తెలియజేసింది. ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతితోనే ఇక ముందు ప్రాజెక్టులన్నీ నిర్మించాల్సి ఉంటుంది.