జాతీయ వార్తలు

నేను తప్పు చేయలేదు : కన్నయ్యకుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:జెఎన్‌యులో జాతివ్యతిరేక వ్యాఖ్యలేవీ తాను చేయలేదని, కొందరు వ్యక్తులు చేసిన నినాదాలు దురదృష్టకరమని జాతివ్యతిరేక వ్యాఖ్యల కేసులో నిందితుడు కన్నయ్యకుమార్ పేర్కొన్నాడు. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కన్నయ్య కోర్టుకు వచ్చినపుడు రెండోసారి దాడి జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ దాడికి పాల్పడిన న్యాయవాదిని గుర్తించిన కన్నయ్య జెఎన్‌యులో జరిగిన వివాదంపై వ్యాఖ్యానించాడు. రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానని, దేశాన్ని గౌరవిస్తానని పేర్కొన్నాడు. యూనివర్శిటీల్లో శాంతి దెబ్బతినకూడదని ఆయన అభిప్రాయపడ్డాడు. కాగా పాటియాలా కోర్టులో రెండుసార్లు ఘర్షణల నేపథ్యంలో ఆరుగురు సీనియర్ న్యాయవాదులతో ఓ కమిటీని వేసి పరిస్థితిని సమీక్షించాలని సూచించింది.